Vijay TVK Leads | టీవీకే అధినేత విజయ్​ ఇంట్లో సంబరాలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay TVK Leads | తమిళనాడు (Tamil Nadu)లో దళపతి విజయ్​ పార్టీ టీవీకే హవా కొనసాగుతోంది. మ్యాజిక్​ ఫిగర్​కు చేరువలో టీవీకే ఉంది. దీంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

చెన్నైలోని విజయ్​ ఇంట్లో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్‌ నివాసం దగ్గర పోలీసులు భద్రత పెంచారు.

Vijay TVK Leads | 110 స్థానాల్లో లీడ్​

తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. అధికారం దక్కాలంటే మ్యాజిక్​ ఫిగర్​ 118. ప్రస్తుతం టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్​కు 8 సీట్లు మాత్రమే తక్కువా ఉన్నాయి. దీంతో ఇతర చిన్న పార్టీల మద్దతుతో విజయ్​ సీఎం కుర్చి ఎక్కే అవకాశం ఉంది. 70 స్థానాల్లో అన్నా డీఎంకే కూటమి, 54 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ (BJP) 27 చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Vijay TVK Leads | పార్టీ పెట్టిన రెండేళ్లకే..

సినీ నటుడు విజయ్​ 2024 ఫిబ్రవరి 2న టీవీకే పార్టీ (TVK Party) ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన రెండేళ్ల మూడు నెలలకు ఆయన అధికార పీఠంపై కూర్చోనున్నారు. ప్రస్తుతం PMK 6, కాంగ్రెస్‌ 5, CPI 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆ పార్టీల మద్దతుతో సీఎం కావడానికి విజయ్​ కసరత్తు ప్రారంభించారు. సాయంత్రం వరకు దీనిపై క్లారిటీ రానుంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు అన్నాడీఎంకేతో పవర్‌ షేరింగ్‌ విజయ్‌ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. చెన్నై సిటీలో తప్ప అన్నిచోట్లా TVK ప్రభంజనం సృష్టించడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *