అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ సీపీగా శ్వేత రెడ్డి (Swethe Reddy) నియమితులయ్యారు. సీఐ సెల్ ఎస్పీగా సింధు శర్మ, సీఐడీ ఎస్పీలుగా రూపేష్, ప్రవీణ్ కుమార్, రైల్వే ఎస్పీగా సాయి శేఖర్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. నార్త్ రేంజ్ జాయింట్ సీపీగా విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా సన్ ప్రీత్ సింగ్‌గా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా చంద్ర మోహన్ ట్రాన్స్ఫర్ అయ్యారు.
Telangana IPS Transfers | హైడ్రా అడిషనల్ కమిషనర్‌గా..
గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్ధిఖీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా పుష్ప, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, హైడ్రా అడిషనల్ కమిషనర్‌గా ఆనంద్ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చింది.
Telangana IPS Transfers | అదనపు బాధ్యతలు

మల్టీ జోన్ – 1 ఐజీగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాకు, యాదాద్రి జోన్ డీఐజీగా జోయల్ డేవిస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజన్న జోన్ డీఐజీగా సన్‌ప్రీత్ సింగ్‌కు, భద్రాద్రి జోన్ డీఐజీగా ఎన్.శ్వేతకు బాసర జోన్ డీఐజీగా ఆర్.భాస్కరన్‌కు, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీగా ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IPS Transfers and Postings pic.twitter.com/5mOhoSeZkM
— IPRDepartment (@IPRTelangana) June 29, 2026
దీనిని కూడా చదవండి : Saikrishna Lockup Death | సాయికృష్ణ లాకప్ డెత్.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు