Road Safety Telangana | తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట : ఎంపీ అర్వింద్​

రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Road Safety Telangana | తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబంధించి తాను లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన సమాధానంలో కీలక వివరాలు వెల్లడయ్యాయని ఆయన తెలిపారు.

Road Safety Telangana | బ్లాక్​ స్పాట్ల గుర్తింపు..

తెలంగాణలో గత కొన్నేళ్లలో ప్రమాదాల ఆధారంగా మొత్తం 1,513 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 1,308 బ్లాక్ స్పాట్లకు సంబంధించిన శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని అర్వింద్ తెలిపారు. మరో 205 బ్లాక్ స్పాట్లలో శాశ్వత నివారణ చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు.

Road Safety Telangana |  ప్రత్యేక ప్రాధాన్యత

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 75 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 3 ప్రాంతాల్లో చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మొత్తం 107 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, అందులో 99 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 8 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు.

Road Safety Telangana | నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని అర్వింద్​ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని ఎన్​హెచ్​–63, ఎన్​హెచ్​–61, ఎన్​హెచ్​–44పై వంతెనలు, బైపాస్‌లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులు వివిధ జాతీయ రహదారి అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రణాళిక, అమలు దశల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని అర్వింద్ తెలిపారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రహదారులు, సురక్షితమైన ప్రయాణం అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తామన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ల నివారణ, వంతెనలు, బైపాస్‌లు, ఇతర రోడ్డు భద్రతా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,023 కోట్లు కేటాయించిందని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్​’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *