Yellareddy Shop Fire | ఎల్లారెడ్డిలో షార్ట్ సర్క్యూట్‌తో దుస్తుల దుకాణం దగ్ధం

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Shop Fire | షార్ట్​ సర్క్యూట్​తో(short circuit fire) దుస్తుల దుకాణం దగ్ధమైంది. ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణ కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Yellareddy Shop Fire | పట్టణంలోని మున్సిపల్​ కార్యాలయ సమీపంలో..

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం (Yellareedy Municipality) సమీపంలో ‘కనెక్ట్ మెన్స్ అండ్ కిడ్స్​వేర్’ దుస్తుల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం దుకాణం కార్మికుడు షాప్ తాళం తీయగా లోపల మంటలు వ్యాపించి ఉండటాన్ని గమనించి వెంటనే యజమాని దేవేందర్‌కు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే దుకాణంలోని సరుకు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమాని నాగం దేవేందర్ తెలిపారు. భారీగా నష్టం జరిగిందని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: CV Anand DGP| అమ్మ కోరిక తీర్చిన కొడుకు..సీవీ ఆనంద్ ఎమోషనల్ పోస్ట్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *