Bladder Stone Surgery | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..యూరినరీ బ్లాడర్​ నుంచి 400 గ్రాముల రాయి తొలగింపు

ఎల్లారెడ్డిలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి యూరినరీ బ్లాడర్​ లో నుంచి 400 గ్రాముల రాయిని తొలగించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bladder Stone Surgery | ఎల్లారెడ్డిలోని (Yellareddy) వెంకటేశ్వర ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి యూరినరీ బ్లాడర్​లో నుంచి 400 గ్రాముల రాయిని తొలగించారు.

Bladder Stone Surgery | నిజాంసాగర్​ మండలంలో..

నిజాంసాగర్ (Nizamsagar) మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిళ (39) కు యూరినరీ సమస్యలతోపాటు తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చారు.

ఆమెకు డాక్టర్​ నాగేశ్వరరావు పరీక్షలు నిర్వహించగా.. యూరినరీ బ్లాడర్‌లో సుమారు 400 గ్రాముల భారీ రాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సోమవారం ఉదయం రోగికి శస్త్రచికిత్స నిర్వహించి, బ్లాడర్‌లోని పెద్ద రాయిని విజయవంతంగా తొలగించారు.

ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. తగినంత నీరు తాగకపోవడం, ఆహార అలవాట్ల వల్ల ఇలాంటి పెద్ద రాళ్లు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: #KJQ Trailer Out Now

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *