Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు టీఆర్​ఎస్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kavitha New Party | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్​ (KCR) కూతురు కొత్త పార్టీ పేరు ప్రకటించారు. శనివారం ఉదయం మేడ్చల్​ సమీపంలోని మునీరాబాద్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తన పార్టీ పేరు టీఆర్​ఎస్​ అని కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాగృతి నాయకులు, కార్యకర్తలు, కవిత అభిమానులు తరలి వచ్చారు. పార్టీ పేరు ప్రకటన అనంతరం ప్రాంగణం జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాగృతి నాయకులు, కార్యకర్తలు, కవిత (Kalvakuntla Kavitha) అభిమానులు తరలి వచ్చారు.

Kavitha New Party | సీఎం అని నినాదాలు

కవిత తన ఇంట్లో సర్వ మత ప్రార్థనలు చేసిన అనంతరం గన్​పార్క్​కు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్​తో సభ వేదికకు చేరుకున్నారు. అన్ని జిల్లాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో సభకు చేరుకున్నారు. వేలాది అభిమానుల మధ్య కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. దీంతో అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

kavitha 4

ఇది కూడా చదవండి..: Kavitha New Party | తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. మరికాసేపట్లో పేరును ప్రకటించనున్న కవిత..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *