NEET Exam Cancellation | ‘నీట్’ రద్దు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే..: బొబ్బిలి రామకృష్ణ

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NEET Exam Cancellation | ‘నీట్’ రద్దుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ(Bobbili Ramakrishna) అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు కావడంపై ఆయన మంగళవారం స్పందించారు.

NEET Exam Cancellation | విద్యార్థులపై తీవ్ర ప్రభావం..

మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency), సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ(Central Ministry of Education), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని  డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకడమిక్ ఇయ‌ర్‌ను కోల్పోయే అవకాశం ఉందన్నారు. దేశంలో అనేక విషయాలపై చర్చ చేసే బీజేపీ.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై సమాధానం చెప్పాలన్నారు.

బీజేపీకి పాలనపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుడి అవసరం బీజేపీకి వద్దా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఖర్చు పెట్టి కోచిం‌గ్‌లు ఇప్పించి నీట్ పరీక్ష రాయించారని తెలిపారు. రాజస్థాన్‌లో నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leak) ఘటనపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Feel The Jail| చంచల్‌గూడలో ‘ఫీల్ ది జైల్’ షురూ.. ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *