Vi Prepaid Family Plan | వీఐ సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ విడుదల

టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ అయిన వీఐ (Vi) సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 'ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్'ను అధికారికంగా ప్రవేశపెట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vi Prepaid Family Plan | టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ అయిన వీఐ (Vi) సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది. భారతదేశంలోనే  ( India ) మొట్టమొదటిసారిగా ‘ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్’ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ‘వీఐ పే సబ్ హైన్ వీఐపీ’ (Vi Pe Sab Hain VIP) అనే సరికొత్త ఆలోచన ఆధారంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. దేశంలో ఎక్కడి నుంచైనా కుటుంబ సభ్యులు సులభంగా కనెక్ట్ అయి ఉండేందుకు, డేటాను పంచుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.

Vi Prepaid Family Plan | ప్లాన్ ప్రత్యేకతలు ..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ క్లాసులు, మ్యాప్స్ వాడకం, డిజిటల్ పేమెంట్స్ వంటి అత్యవసర సమయాల్లో డేటా అయిపోతే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తెచ్చారు. యాక్టివ్‌గా ఉన్న వీఐ ప్రీపెయిడ్ యూజర్లు తమ వీఐ యాప్ ద్వారా ఒక ప్రైమరీ మెంబర్, ముగ్గురు సెకండరీ మెంబర్లతో కలిపి ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లోని ప్రతి సభ్యుడు తమ స్వంత ప్రీపెయిడ్ ప్లాన్, వాలిడిటీని యథాతథంగా కొనసాగిస్తూనే.. అవసరమైనప్పుడు ఒకసారికి 500 MB వరకు డేటాను ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా లేదా వేర్వేరు నగరాల్లో ఉన్నప్పటికీ ఈ గ్రూప్‌లో చేరి డేటా ప్రయోజనాలను పొందవచ్చు.

Vi Prepaid Family Plan | రీఛార్జ్‌లపై డిస్కౌంట్లు ..

వీఐ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు ఎవర్ని రీఛార్జ్ చేసినా 10% వరకు గ్యారెంటీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ సరికొత్త సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి వీఐ ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్​క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *