అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bathukamma Celebrations | ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ అని సంస్కార భారతి జిల్లా కార్యదర్శి మాధురి అన్నారు. నగరంలోని(Nizamabad) న్యూ ఎన్జీవోస్ కాలనీలోని అమృత్పార్క్లో బతుకమ్మ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Bathukamma Celebrations | అంబరాన్నింటిన సంబరాలు..
అమృత్పార్క్లో శుక్రవారం నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలంతా తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి వాటిచుట్టూ ఆడిపాడారు. మాధురి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోందన్నారు. బతుకమ్మ పండగను సంస్కార భారతి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్కార భారతి ప్రతినిధులు కంకణాల భాగ్యలక్ష్మి, లక్ష్మణ్ గుత్ప, నగర కన్వీనర్ నగుర్తి శంకర్, సాహిత్యశాఖ కేవీ రమణాచారి, నాగనాథ్, మధుసూదనా చారి, శశిరేఖ, శ్రీలత, శ్రీకాంత్, మల్లేష్, సాయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లోకి Rapido Ownly.. ఫుడ్ ధరలు తగ్గుతాయా?