Hydraulic Lifter Services | విద్యుత్​ సమస్యల పరిష్కారానికి హైడ్రాలిక్​ లిఫ్టర్​ సేవలు ప్రారంభం

నగరంలోని విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్​కో ఎస్​ఈ నాగేశ్వర్​రావు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Hydraulic Lifter Services | నగరంలోని (Nizamabad) విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్​కో (TRANSCO) ఎస్​ఈ  పీవీ రాజేశ్వర్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు పవర్​హౌస్​లో వాహనాలను తనిఖీ చేశారు.

Hydraulic Lifter Services | వినియోగదారులకు మెరుగైన సేవలు

ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ట్రాన్స్​కో సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో టీజీఎన్‌పీడీసీఎల్, నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో టాటా యోధా 3.0 ఎంటీ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ వాహనం ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల బ్రేక్‌డౌన్‌లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ (FOC), చెట్ల కొమ్మల తొలగింపు, ఎత్తైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, పరికరాల నిర్వహణ పనులు సురక్షితంగా, వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.

ప్రత్యేకించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంతో పాటు, విద్యుత్ సిబ్బంది భద్రతతో పనులు నిర్వహించేందుకు ఈ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఎస్​ శ్రీనివాస్​రావు, డీ వెంకట రమణ, ఏఈడీఎస్​ చంద్రశేఖర్​, ప్రసాద్​ రెడ్డి, వినోద్​, శ్రీధర్​, తోట రాజశేఖర్​, ఏఈఎస్​ నగేష్​, కాశీనాథ్​, సుమిత, నాయకులు రఘునందర్​, పూదరి గంగాధర్​, గంగారాం నాయక్​, చెన్నయ్య, శ్రీనివాస్​, ఏఈవో శ్రీనివాస్​, ఎస్​ఐ, డీవన్​ సిబ్బంది, ఎస్​ఈ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: LIC Share Price | ఎల్ఐసీకి ఏమయ్యింది?.. భారీగా పతనమైన షేరు ధర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *