Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాసరెడ్డి చూపు కేసీఆర్​ వైపు.. కాంగ్రెస్​ సర్కారుపై ఘాటు విమర్శలు!

"బాన్సువాడ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, డెవలప్‌మెంట్ పనుల కోసం సీఎం, మంత్రులకు ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ఎత్తకపోవడం విచారకరం." — పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pocharam Srinivas Reddy | తెలంగాణ Telangana రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గులాబీ గూటిని వీడి హస్తం వైపు అడుగులు వేసిన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రుల తీరుపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy | ‘నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు’

తానెప్పుడూ స్వార్థ రాజకీయాల కోసం నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసిన పోచారం, పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జాతీయ జెండానే నా మార్గం: తాను అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా “జాతీయ జెండాను కప్పుకొన్నాను” అని పేర్కొన్నారు.

Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా

కేసీఆర్‌పై చెరగని గౌరవం: “కేసీఆర్ గొప్ప నాయకుడు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే సాధ్యమైంది. అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోయే రకం కాదు నాది. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేకుండే” అంటూ తన అంతర్మథనాన్ని బయటపెట్టారు.

బీఆర్ఎస్ వీడటానికి కారణం: బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నాయకుల వ్యవహారశైలి, తీరు వల్లే తాను ఆ పార్టీకి దూరం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Pocharam Srinivas Reddy | రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి:

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇస్తుందనే ఆశతో ముందడుగు వేసిన పోచారానికి, అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురవుతున్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.

“బాన్సువాడ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, డెవలప్‌మెంట్ పనుల కోసం సీఎం, మంత్రులకు ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ఎత్తకపోవడం విచారకరం.” — పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే

akshara today .jpg

Pocharam Srinivas Reddy | పొలిటికల్ ‘యు-టర్న్’ సంకేతాలు?

కాంగ్రెస్ తీరుపై బహిరంగంగానే విరుచుకుపడటం, కేసీఆర్ పాలనను కొనియాడటం వెనుక పోచారం తీవ్ర తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి సర్కారు నుంచి సరైన సహకారం అందకపోవడంతో ఆయన మళ్లీ సొంతింటి వైపు చూస్తున్నారా? అనే చర్చ ప్రారంభమైంది.

Pocharam Srinivas Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కలవరం

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సీనియర్ నాయకునికే మంత్రుల వద్ద అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం, అభివృద్ధి నిధులు ఆగిపోవడం అనేది ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కూడా కొత్త భయాలను, సందేహాలను రేకెత్తిస్తోంది.

Pocharam Srinivas Reddy | ధర్మసంకటంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం

చేరికల సమయాల్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. తీరా చేరాక సీనియర్ నేతలను పక్కన పెట్టడం వల్ల సొంత కూటమిలోనే అసమ్మతి రేగుతోంది. పోచారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బలమైన ఆయుధంగా మారాయి.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నది ఎంత నిజమో.. అనుభవజ్ఞులైన నేతలకు గౌరవం తగ్గితే రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయన్నది అంతే నిజం. కేసీఆర్‌ను ప్రశంసిస్తూ, రేవంత్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ అడుగులు వేస్తారో వేచి చూడాల్సిందే.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *