అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi Detention | రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి తరలించారు. దీంతో ప్రధాని మోదీ (PM Modi) నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ లోక్‌సభ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసం ఎదుట నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ అంశంపై నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యకు నిరసనగా రాహుల్ గాంధీ ధర్నా చేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని నిరసన ప్రదేశంలో గాంధీని కలిసి, ధర్నా విరమించుకోవాలని కోరారు.
Rahul Gandhi Detention | వెనక్కి తగ్గకపోవడంతో..
నీట్ ఆంశంపై పార్లమెంటులో చర్చ జరగాలన్న కాంగ్రెస్ నేత ప్రాథమిక డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ధర్నాను విరమించలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతలను అక్కడి నుంచి తరలించారు.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg, detained by Delhi Police. pic.twitter.com/mkctEgsybl
— ANI (@ANI) July 21, 2026
దీనిని కూడా చదవండి : KTR Sensational Comments | కేసీఆర్ అంత మంచోడిని కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు