RTC Strike | కల్వకుర్తిలో ఉద్రిక్తత.. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై కారం చల్లిన ఆర్టీసీ కార్మికులు!

Balla Sandeep Kumar

అక్షరటుడే, నాగర్ కర్నూల్: RTC Strike | తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల (RTC workers) నిరసనలు కల్వకుర్తిలో హింసాత్మకంగా మారాయి. కల్వకుర్తి ఆర్టీసీ డిపో (Kalvakurthi RTC Depot) ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు, ప్రైవేట్ డ్రైవర్లు బస్సులు నడపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

RTC Strike | డ్రైవర్‌పై కారంతో దాడి:

తాము కడుపు మండి సమ్మె చేస్తుంటే, మీరు బస్సులు నడుపుతారా అంటూ కార్మికులు ప్రైవేట్ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహం తట్టుకోలేక ఓ మహిళా కార్మికురాలు ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ కళ్లలో కారం చల్లింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసుల కేసు నమోదు:

నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ డ్రైవర్‌ (Private Driver)పై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు, తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: TGSRTC Strike | ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి.. సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *