Bengal Young Voters | యువ ఓటర్ల చుట్టూ రాజకీయ హామీలు.. పశ్చిమ బెంగాల్​లో వారే 40 శాతం

Naresh Chandan
Bengal Young Voters

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bengal Young Voters | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో యువ ఓటర్ల ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోంది. మొత్తం ఓటర్లలో సుమారు 40 శాతం మంది 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారే కావడం గమనార్హం. దీంతో ఈ యువత ఏం ఆలోచిస్తోంది? వారి ఆశలు, అంచనాలు ఏమిటి? అన్నది ఎన్నికల రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.

Bengal Young Voters | ఉత్తమ భవిష్యత్తుపై ఆశలు..

ఉద్యోగావకాశాలు, పరిశ్రమల తరలింపు (ఇండస్ట్రీ ఫ్లైట్), మౌలిక వసతుల అభివృద్ధి, నాయకత్వంపై నమ్మకం వంటి అంశాలపై యువత తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ తరం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థుల అభిప్రాయాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఎన్నికలపై, రాష్ట్ర అభివృద్ధిపై, ప్రభుత్వ విధానాలపై వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. యువతలో రాజకీయ చైతన్యం పెరుగుతున్నదానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా.. ఆయా రాజకీయ పార్టీలు యువ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. వారిని బుట్టలో వేసుకునేందుకు హామీల వర్షాలు కురిపిస్తున్నాయి. మరి అక్కడి యువత రాజకీయ హామీల వర్షంలో తడిసి ముద్దవుతారా..? లేక తెలివిగా వ్యవహరించి, రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తారా..? అనేది దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Harish Rao Delhi Visit | హరీశ్​రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *