Phone Addiction | ఫోన్​ వ్యసనంపై ప్రధాని మోదీ ఆందోళన

పిల్లలు, విద్యార్థులు ఫోన్​కు బానిసలుగా మారడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Addiction | పిల్లలు, విద్యార్థులు ఫోన్​కు బానిసలుగా మారడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో శనివారం ఆయన మాట్లాడారు.

మోదీ మాట్లాడుతూ.. స్క్రీన్ టైమ్ ఇప్పుడు ఒక రకమైన వ్యసనంగా మారిందన్నారు. పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి చూపితే.. ఫోన్​ వ్యసనం నుంచి విముక్తి పొందవచ్చన్నారు. పిల్లలను సృజనాత్మక కార్యకలాపాలలో ఎంత ఎక్కువగా నిమగ్నం చేస్తే, దానిని ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించడాన్ని మనం అంతగా అలవాటు చేసుకోవాలని సూచించారు. కొన్ని ప్రధాన నగరాలు, విశ్వవిద్యాలయాలలో డ్రగ్స్​ వాడకంపై సైతం ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. యువతలో డ్రగ్స్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలి.. పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలి..

Phone Addiction | 82 మందికి అవార్డులు

కాశీ ఎంపీగా ఉన్న తాను అక్కడ రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించానని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు మహిళలు స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు. అలాగే ఉపాధ్యాయులు సైతం చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్దాలని సూచించారు. జాతీయ పురస్కార గ్రహీత అయిన ఒక ఉపాధ్యాయురాలితో సంభాషిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సలహా అడిగారు. దానికి ఆ ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. కాగా ఈ ఏడాది 82 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు వచ్చాయి. NEP ప్రకారం వాస్తవ జీవన నైపుణ్యాలను బోధించాలని మోదీ వారికి సూచించారు.

దీనిని కూడా చదవండి : Nepal Floods | 1300 మందికి చేరిన మృతులు.. ఇంకా తేరుకోని నేపాల్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *