OPPO Find X9 Ultra 5 G | అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి ఒప్పో ఫోన్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: OPPO Find X9 Ultra 5 G | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌లో మరో ప్రీమియం మోడల్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా పేరిట తీసుకువచ్చిన ఈ ఫోన్ లో భారీ బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్‌తోపాటు 200 ఎంపీ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మంగళవారం సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ (Amazon)తోపాటు ఒప్పో స్టోర్‌లలోనూ అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

OPPO Find X9 Ultra 5 G | డిస్‌ప్లే..

6.82 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ ఫ్లెక్సిబుల్ ఆమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెచ్ జెడ్ రిఫ్రెష్‌రేట్, 1,800 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తుంది.

OPPO Find X9 Ultra 5 G | ప్రాసెసర్..

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16తో కూడిన కలర్ ఓఎస16 ఆధారంగా పనిచేస్తుంది.

OPPO Find X9 Ultra 5 G | కెమెరా సెటప్..

వెనకవైపు 200 ఎంపీ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 200 ఎంపీ టెలిఫొటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా టెలిఫొటో కెమెరాలు ఇచ్చారు. ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ : 7,050 ఎంఎహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 100 డబ్ల్యూ సూపర్ వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ను, 50 డబ్ల్యూ ఎయిర్ వూక్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

వేరియంట్ : తుండ్రా అంబర్, ఆరెంజ్ కలర్స్‌లో సింగిల్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. 12 జీబీ, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,69,999.

కార్డ్ ఆఫర్స్ : ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి ఎంపిక చేసిన బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ వర్తించనుంది.

ఇది కూడా చదవండి..: Stock Market Flat | ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *