అక్షరటుడే వెబ్‌డెస్క్: Andhra Pradesh cabinet decisions | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసింది. పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సుమారు 85 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది.
Andhra Pradesh cabinet decisions | పెట్టుబడుల జాతర..
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీ విస్తరణ (రూ. 10 వేల కోట్లు), ప్రకాశం జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టు (రూ. 1,230 కోట్లు), రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు, అనకాపల్లిలో CtrlS డేటా సెంటర్ (రూ. 2,788 కోట్లు), విశాఖలో Sify డేటా సెంటర్ విస్తరణ, అలాగే విశాఖలోనే Infinx ఐటీ క్యాంపస్ ద్వారా 4 వేల ఉద్యోగాల కల్పన. క్వాంటమ్ వ్యాలీ కింద 11 AI సంస్థల పెట్టుబడులు, విజయనగరంలో పతంజలి ఫుడ్ పార్క్‌కు 70 ఎకరాల భూమి, రూ. 3,500 కోట్లతో మాగ్నెట్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చ జరిగింది.

Andhra Pradesh cabinet decisions | అమరావతికి మహర్దశ..
రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, రాజధానిలో అత్యాధునిక సౌకర్యాలతో 5-స్టార్ హోటళ్లు , కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించనుంది. అలాగే, అమరావతి జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ. 130 కోట్లు కేటాయించగా, ఉండవల్లి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 426 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం APCRDA పరిధిలో కొత్తగా 95 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh cabinet decisions | పాలసీలలో మార్పులు..
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించారు. తిరుపతి మినహా ఇతర విమానాశ్రయాల్లో మద్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు, టూరిస్ట్ బస్సుల పన్నును సీటుకు రూ. 4 వేల నుంచి రూ. 2,500కు తగ్గించడం వంటి కీలక నిర్ణయాలను చర్చించారు.
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని సవరించడం, యాగంటి పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 1500 MWకు పెంచడం , అనంతపురంలో NTPC 1200 MW సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇది కూడా చదవండి: Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల అరెస్ట్.. సాధారణ వ్యక్తిలా బైక్‌పై వచ్చి నిరసన