అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | యూఎస్ -ఇరాన్ చర్చలలోని పరిణామాలను ఇన్వెసర్లు గమనిస్తుండడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ఎరుపెక్కాయి. ప్రపంచ మార్కెట్లనుంచి నెగెటివ్ సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం ఒడిదుడుకులకు లోనయ్యింది. దీనికితోడు ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదు కావడం, బలహీనమైన వ్యాపార గణాంకాలపై ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ప్రధాన సూచీలు భారీగా నష్టపోయాయి.
Stock Market Crash | స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 108 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి అమ్మకాల ఒత్తిడికి గురై 1,112 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 64 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 350 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 893 పాయింట్ల నష్టంతో 76,200 వద్ద, నిఫ్టీ 278 పాయింట్ల నష్టంతో 23,824 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,496 కంపెనీలు లాభపడగా 2,794 స్టాక్స్ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 195 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 55 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైక కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్లమేర తగ్గింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్ లాభపడగా.. 26 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 0.83 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.28 శాతం, సన్‌ఫార్మా 0.23 శాతం, మారుతి 0.07 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 3.36 శాతం, టీసీఎస్ 3.16 శాతం, బీఈఎల్ 2.67 శాతం, టాటా స్టీల్ 2.66 శాతం, అదానీపోర్ట్స్ 2.42 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: SpaceX Share Fall | ‘స్పేస్ ఎక్స్’ షేర్లలో భారీ పతనం!.. మూడు రోజుల్లో 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి