HRA Hike | హెచ్ఆర్ఏ 4 శాతం పెంచాలి.. 8వ వేతన సంఘానికి ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు కసరత్తు వేగంగా జరుగుతోంది. హెచ్ఆర్ఏ పెంచి దానికి డీఏ అనుసంధానించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HRA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees), పెన్షనర్ల వేతనాల పెంపునకు సంబంధించి 8వ వేతన సంఘం కసరత్తు వేగవంతం చేసింది. వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను కమిషన్ పరిశీలిస్తోంది. బేసిక్ శాలరీ పెంచడమే కాకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా హౌస్ రెంట్ అలవెన్స్‌లోనూ మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

HRA Hike | అద్దెలకు, హెచ్ఆర్ఏ కు భారీ వ్యత్యాసం..

ప్రస్తుతం అద్దెలు ఆకాశాన్నంటుతున్నందున పాత పద్ధతులకు వీడి సరికొత్త అద్దె భత్యాల విధానాన్ని తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. నేషనల్ కౌన్సిల్ -జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాఫ్ సైడ్ ప్రతినిధులు కమిషన్‌కు సమర్పించిన వినతి ప్రకారం ‘మెట్రో నగరాల్లో జీవన వ్యయం, గృహాల అద్దెలు కొన్నేళ్లుగా ఊహించని రీతిలో పెరిగాయి. ప్రస్తుత హెచ్ఆర్ఏ (HRA) రేట్లు అతి తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ అద్దెలకు, ఉద్యోగులు పొందే భత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని స్టాఫ్ సైడ్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

HRA Hike | ఎక్స్, వై, జెడ్ క్లాస్‌లుగా..

నగరాల జనాభాను బట్టి హెచఆరఏను మూడు కేటగిరీలుగా విభజించి రేట్లను భారీగా పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. 50 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను ఎక్స్ -క్లాస్‌లో చేర్చి హెచ్ఆర్ఏ 40 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 5 నుంచి 50 లక్షల జనాభా ఉన్న నగరాలను వై -క్లాస్‌లో చేర్చి 35 శాతం, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను జెడ్ -క్లాస్ నగరాలుగా గుర్తించి 30 శాతంహెచ్ఆర్ఏ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రతి ఐదేళ్లకోసారి నగరాల జనాభా వృద్ధి, గృహాల అద్దె మార్కెట్‌ను సమీక్షించి కేటగిరీలను అప్‌డేట్ చేయాలంటున్నారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి.

HRA Hike | డీఏతో లింక్..

ఈసారి హెచ్ఆర్ఏ ను డియర్నెస్ అలవెన్స్‌తో అనుసంధానించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇలా చేస్తే డీఏ పెరిగిన ప్రతిసారీ హెచఆరఏ కూడా పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా మంది పెన్షనర్లు అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని, అందువల్ల పెన్షనర్లకు సైతం హెచఆరఏ ప్రయోజనాలను విస్తరించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Udhayanidhi Stalin Remarks | అసెంబ్లీని సినిమా హాల్​లా మార్చిన సీఎం విజయ్​ : ఉదయనిధి స్టాలిన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *