అక్షరటుడే,ఇందూరు: Manik Bhavan Alumni Reunion | దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఆ స్నేహితుల కళ్లల్లో ఆనందబాష్పాలు వెలకట్టలేనివి. హోదాలు, బాధ్యతలు పక్కనపెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఆ బాల్య మిత్రులు ఆనందంతో చిందులేశారు. నగరంలోని(Nizamabad) నూతన వైశ్య ఉన్నత పాఠశాల(మాణిక్ భవన్)(Manik Bhavan) 1976–77 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు స్వర్ణోత్సవాన్ని(Golden Jubilee) ఘనంగా నిర్వహించారు.
Manik Bhavan Alumni Reunion | 50 ఏళ్ల తర్వాత..
నగరంలోని మాణిక్ భవన్ 1976–77 బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో అపూర్వ సమ్మేళనాన్ని స్వర్ణోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించారు. 50ఏళ్ల క్రితం పాఠశాలలో తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. తమ కుటుంబ వివరాలను ఒకరికొకరు పంచుకున్నారు. ‘తలలు పండినా తరగని స్నేహం మాది’అంటూ ఆడిపాడారు. ఆనాడు తమకు విద్యాబుద్ధుల నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.
ఇది కూడా చదవండి: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి