Chandrababu Warning | వైసీపీ గొడ్డలి పార్టీ విష వృక్షం లాంటిది: సీఎం చంద్రబాబు

వైసీపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకోవడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu Warning | వైసీపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకోవడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ( తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ( Vijayawada )సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి ఒకే వేదికపై కనిపించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం నిర్వహించిన పార్టీ టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Chandrababu Warning | వారి ట్రాప్‌లో పడొద్దని..

వైసీపీని “గొడ్డలి పార్టీ”, ఒక విష వృక్షంలాంటిదంటూ చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయాన్ని ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ అజెండా అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు నిరంతరం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని, వారి ట్రాప్‌లో పడొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ, పార్టీ శ్రేణులంతా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Navadurga Devi Bonalu | నవదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *