Country Bomb Blast | బాన్సువాడలో కలకలం.. నాటు బాంబు పేలి ఆరుగురికి గాయాలు..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ కచ్చా ప్రాంతంలో ఆదివారం నాటు బాంబులు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Country Bomb Blast | పట్టణంలోని (Banswada) ఎర్రమన్ కచ్చా ప్రాంతంలో ఆదివారం నాటు బాంబులు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Country Bomb Blast | ఎర్రమన్​ కచ్చా ప్రాంతంలో..

వివరాల్లోకి వెళ్తే.. ఎర్రమన్ కచ్చా ప్రాంతానికి చెందిన దాసరి లక్ష్మయ్య ఇంటి వద్ద మోపెడ్‌లో పందుల వేట కోసం నిల్వ ఉంచిన నాటు బాంబులు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలినట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో దాసరి లక్ష్మయ్యతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి గాయపడిన వారిని స్థానికులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల పూర్తి కారణాలు, బాంబుల నిల్వ వెనుక ఉన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: అనంతపురంలో టీడీపీ రిగ్గింగ్‌ ఆరోపణలు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *