US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు అక్కడి ఓటర్లు షాక్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Midterm Elections | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ (Donald Trump)కు అక్కడి ఓటర్లు షాక్​ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్స్​ను గెలిపించారు. రిపబ్లికన్ల కంచుకోటలో పాగావేసిన డెమోక్రాట్స్ విజయం సాధించడం గమనార్హం.

అమెరికా మధ్యంతర ఎన్నికలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే డెమోక్రాట్లు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. టెక్సాస్, కాన్సాస్, ఓహియోలో వారి హవా కొనసాగింది. కొన్నేళ్లుగా రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న సౌత్ కరోలినా సెనేట్​ను సైతం కైవసం చేసుకున్నారు. టెక్సాస్ సెనేట్‌లో 32 ఏళ్ల తర్వాత డెమోక్రాట్స్ విజయం సాధించడం గమనార్హం. సెనేట్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను డెమోక్రాట్స్ అధిగమించారు. దీంతో ట్రంప్ పదవీకాలం ముగిసేంత వరకు డెమోక్రాట్స్ చేతిలోనే సెనేట్, కాంగ్రెస్ ఉండనున్నాయి.

US Midterm Elections | ట్రంప్​పై అసంతృప్తి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై అమెరికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉక్రెయిన్​ యుద్ధం, టారిఫ్​ల నేపథ్యంలో ఆయనపై వ్యతిరేకత వచ్చింది. అంతేగాకుండా ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్​, డీజిల్​ ధరలు సైతం పెరిగాయి. ఈ క్రమంలో మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్​కు షాక్​ ఇచ్చారు.

US Midterm Elections | నేను పోటీ చేస్తే..

మధ్యంతర ఎన్నికలలో డెమోక్రాట్లు ప్రతినిధుల సభను గెలుచుకుంటారని, సెనేట్‌ను కూడా కైవసం చేసుకునేందుకు చేరువలో ఉన్నారని అంచనా వేస్తున్న తరుణంలో, ఒకవేళ తాను పోటీలో ఉండి ఉంటే తన రిపబ్లికన్ పార్టీ “భారీ విజయం” సాధించి ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సెనేట్​లో డెమోక్రాట్లు 54, రిపబ్లికన్లు 44, కాంగ్రెస్​లో డెమోక్రాట్లు 208, రిపబ్లికన్లు 129 స్థానాల్లో విజయం సాధించారు.

ఇది కూడా చదవండి..: China secret space plane | అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. ఫొటో విడుదల చేసిన అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *