Prambanan Temple | ఓం నమః శివాయ మంత్రోచ్ఛారణలతో మా ర్మోగిన ప్రంబనన్.. ఇండోనేషియాలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అక్కడ గల ప్రసిద్ధ చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Prambanan Temple | ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అక్కడ గల ప్రసిద్ధ చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ పురాతన హిందూ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాంగణం ‘ఓం నమః శివాయ’ మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది.

Prambanan Temple | శివుడితో నాది విడదీయలేని బంధం..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తన జన్మస్థలమైన వడ్ నగర్‌లోని హాటకేశ్వర్ మహాదేవ్ నుంచి సోమనాథ్, కాశీ విశ్వనాథుడు, కేదార్‌నాథ్, ఉజ్జయిని మహాకాల్ వరకు శివుడితో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని తెలిపారు. ఇండోనేషియాలోని ఈ చారిత్రక ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. హెలికాప్టర్ ద్వారా ఆలయానికి చేరుకున్న మోదీ, ఆకాశం నుంచి తీసిన ఆలయ అద్భుత దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

prambanan.1

Prambanan Temple | భారత్-ఇండోనేషియా ఒప్పందం..

భారత్-ఇండోనేషియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా, ఈ ఆలయ సముదాయాన్ని సంరక్షించి, పునరుద్ధరించేందుకు ఉమ్మడి ప్రాజెక్టును చేపట్టనున్నాయి. మంగళవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో మోదీ, ప్రబోవోలు ఇందుకు సంబంధించిన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకాలు చేశారు.

Prambanan Temple | ప్రంబనన్ ఆలయ విశేషాలు..

కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ తర్వాత ఆగ్నేయాసియాలోనే ఇది రెండవ అతిపెద్ద హిందూ ఆలయ సముదాయం. 9వ శతాబ్దంలో మాతారం రాజుల కాలంలో దీనిని నిర్మించారు. ఇది శివ, విష్ణు, బ్రహ్మలకు అంకితం చేయబసారు. ఇందులో 47 మీటర్ల ఎత్తైన శివాలయం ప్రధాన ఆకర్షణ. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, పురాణ శిల్పాలు భారత్-ఆగ్నేయాసియా దేశాల మధ్య ఉన్న నాటి వాణిజ్య, సాంస్కృతిక బంధాలకు నిదర్శనం. ప్రకృతి విపత్తుల వల్ల పాడైన ఈ ఆలయాన్ని 20వ శతాబ్దంలో పునరుద్ధరించగా, 1991లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తాజాగా భారత్ సహకారంతో జరగనున్న పునరుద్ధరణ పనులు, రెండు దేశాల మధ్య ఉన్న నాగరికతా అనుబంధాన్ని మరింత దృఢపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *