China secret space plane | అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. ఫొటో విడుదల చేసిన అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ!

వాతావరణం సహకరిస్తే తెల్లవారుజామున నింగిలో కదిలే ఈ చైనా రహస్య విమానాన్ని సామాన్య ప్రజలు కూడా కంటితో చూసే అరుదైన అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: China secret space plane | అంతరిక్ష పరిశోధనల పేరుతో ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్న చైనా China కు చెందిన రహస్య రోబోటిక్ అంతరిక్ష విమానం ‘షెన్‌లాంగ్’ (Shenlong) దృశ్యాలు తాజాగా బయటపడ్డాయి.

అమెరికా రక్షణ నిఘా సంస్థ (US Defense Intelligence) విడుదల చేసిన నివేదికలో ఈ రోబోటిక్ విమానానికి సంబంధించిన అత్యంత అరుదైన, స్పష్టమైన ఫొటోను పొందుపరచడం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

గడిచిన ఆరేళ్లుగా భూమికి సమీప కక్ష్యలో (Low Earth Orbit) కదలాడుతున్న ఈ వ్యోమనౌక.. అంతరిక్షంలో మిస్టరీ వస్తువులను విడుదల చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

China secret space plane | 90 కిలోమీటర్ల దూరం నుంచి హై-రిజల్యూషన్ పిక్!

Space.com నివేదిక ప్రకారం, ఈ అరుదైన చిత్రాన్ని 2024లోనే ప్రసిద్ధ ఉపగ్రహ సాంకేతిక సంస్థ ‘వాంటర్’ (పూర్వపు మాక్సర్ టెక్నాలజీస్) కి చెందిన శాటిలైట్ కెమెరా బంధించింది. ఏకంగా 90 కిలోమీటర్ల దూరం నుంచి, ఒక్కో పిక్సెల్‌కు 4.5 సెంటీమీటర్ల క్లారిటీ ఉండే రిజల్యూషన్‌తో ఈ విమానం పొందికను ఫొటోలో స్పష్టంగా చూపించారు.

చిత్రంలో షెన్‌లాంగ్ నౌక మరో ఉపగ్రహంతో అనుసంధానమై ఉండగా.. దానికి ఉన్న సోలార్ ప్యానెళ్లు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా దాని వెనుక వైపు ఉండే పేలోడ్ డోర్ తెరిచి ఉన్నట్లు ఈ పిక్‌ ద్వారా వెల్లడైంది.

China secret space plane | అమెరికా ‘X-37B’కి పోటీగా చైనా డ్రాగన్!

అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన ‘బోయింగ్ X-37B’ తరహాలోనే చైనా కూడా ఈ పునర్వినియోగ (Reusable) అంతరిక్ష విమానాన్ని రూపుదిద్దింది. సాధారణ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లే ఈ విమానం.. కక్ష్యలో తన ప్రయోగాలు ముగించుకున్న తర్వాత సాధారణ విమానం తరహాలోనే తిరిగి సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అవుతుంది. జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ సహాయంతో చైనా దీని నాలుగో మిషన్‌ను ప్రారంభించింది.

China secret space plane | కంటికి కనిపించనున్న ‘స్పేస్ ప్లాన్’

సుమారు 26 అడుగుల పొడవు ఉండే ఈ రోబోటిక్ విమానం ప్రయాణ మార్గానికి సంబంధించి Space.com పలు కీలక వివరాలు వెల్లడించింది. డెన్వర్, లాస్ ఏంజెల్స్ నగరాల మీదుగా ఇది ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది.

వాతావరణం సహకరిస్తే తెల్లవారుజామున నింగిలో కదిలే ఈ చైనా రహస్య విమానాన్ని సామాన్య ప్రజలు కూడా కంటితో చూసే అరుదైన అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *