Fire Accident | విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం..

విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఆవరణలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fire Accident | విశాఖపట్నం (Visakhapatnam) పోర్టు ట్రస్ట్ ఆవరణలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.

Fire Accident | కన్వేయర్ బెల్ట్‌లో చెలరేగిన మంటలు..

ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ జె.ఎం. భక్షి (J.M. Baxi) ఆధ్వర్యంలో విశాఖ పోర్టు ట్రస్ట్ ఆవరణలో కన్వేయర్ బెల్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా భారీగా నల్లటి దట్టమైన పొగ కిలోమీటరు దూరంలోని నగర ప్రాంతాలకూ వ్యాపించింది. దీంతో పోర్టు సిబ్బందితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Fire Accident | తృటిలో తప్పిన పెను ప్రమాదం..

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే విశాఖ పోర్టు ట్రస్ట్ ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోర్టు ఫైర్ ఇంజన్లతో పాటు విశాఖ నగరానికి చెందిన పలు అగ్నిమాపక యంత్రాలను రెస్క్యూ ఆపరేషన్‌లో రంగంలోకి దించారు. వాటర్ టెండర్ల సాయంతో సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తత వల్ల మంటలు పక్కనే ఉన్న ప్రమాదకర బల్క్ కార్గో బెర్తులు, ఇతర సరుకులకు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది.

Fire Accident | షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు..

వెల్డింగ్ పనుల సమయంలో వచ్చిన నిప్పురవ్వలు కన్వేయర్ బెల్ట్ మెటీరియల్‌కు అంటుకోవడం వల్ల లేదంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ భారీగా దగ్ధమైంది. పోర్టు అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి అసలు కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: TTD New Chairman | నేటితో యుగియనున్న టీటీడీ పాలక మండలి గడువు.. కొత్త ఛైర్మన్ ఎవరయ్యేనో..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *