Pavala Syamala | నడిరోడ్డుపై నిస్సహాయంగా పావలా శ్యామల.. అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pavala Syamala | తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమెకు సంబంధించిన ఘటన సినీ వర్గాలతో పాటు అభిమానులను కూడా కలచివేసింది. తాజా సమాచారం ప్రకారం, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల (Pavala Syamala) ఇటీవల గుండె సంబంధిత సమస్యల కారణంగా కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆమె అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ జరిగిన పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

Pavala Syamala | ప‌రిస్థితి దారుణం..

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, చికిత్స అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి బయలుదేరిన సమయంలో ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవర్, కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో ఆమెను దింపి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి బాగోలేక నిస్సహాయ స్థితిలో ఫుట్‌పాత్‌పై ఉన్న ఆమెను అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గుర్తించినట్లు తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన వారు వెంటనే స్పందించి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు, ఆర్కే ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించారు. వారి సహకారంతో పావలా శ్యామలను వెంటనే సనత్‌నగర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Pavala Syamala |సీనియర్ నటి నేడు ఇలాంటి పరిస్థితుల్లో

పావలా శ్యామల పరిస్థితి తెలిసిన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం అందించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రస్తుతం ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సినీ పరిశ్రమ పెద్దలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి మరింత సహాయం అందించాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి నేడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పావలా శ్యామల త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *