Harish Rao Ponguleti Criticism | పొంగులేటి కాదు.. పొంగులూటీ : హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు, రైతులు, భూముల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Ponguleti Criticism | మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటి కాదు.. “పొంగులూటీ” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిషేధిత జాబితా నుంచి 98 శాతం భూములను తొలగించామని మంత్రి చేస్తున్న ప్రచారంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Harish Rao Ponguleti Criticism | పటాన్​చెరులోనే 50 వేల ఎకరాలకు పైగా..

“98 శాతం నిషేధిత భూములను తొలగించామని పొంగులేటి బొంకుతుండు. అదే నిజమైతే.. పటాన్‌చెరు నియోజకవర్గంలోనే 50,565 ఎకరాలు నిషేధిత జాబితాలో ఎందుకున్నాయి?” అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. మంత్రి చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు.

మంత్రి చేసిన తప్పులకు సామాన్య ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలంటూ హరీశ్‌రావు నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు, రైతులు, భూముల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితా వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Harish Rao Ponguleti Criticism | మంత్రి తప్పు చేస్తే.. శిక్ష ప్రజలకా..

“తప్పు మంత్రి చేస్తే.. శిక్ష ప్రజలు ఎందుకు అనుభవించాలి?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలపై బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని అన్నారు.

మంత్రి పొంగులేటికి నిజాయితీ ఉంటే వెంటనే బేషరతుగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 98 శాతం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెబుతున్న ప్రభుత్వం.. మిగిలిన భూముల వివరాలపై కూడా ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.

Revanth Reddy Ticket | రేవంత్ చెప్పినంత మాత్రాన సీటు ఖరారైనట్టు కాదు!..పరకాల టికెట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్.. కాంగ్రెస్‌లో మళ్లీ చర్చకు దారితీసిన అభ్యర్థిత్వ అంశం

నిషేధిత భూముల అంశం మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. పటాన్‌చెరులో 50,565 ఎకరాల అంశాన్ని తెరపైకి తెచ్చిన హరీశ్‌రావు.. మంత్రి పొంగులేటి ప్రకటనల విశ్వసనీయతపైనే నేరుగా ప్రశ్నలు సంధించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *