Pallagutta Protection | పల్లగుట్టను కొల్లగొడితే ఊరుకునేది లేదు..: చాడ వెంకట్​రెడ్డి

ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడూరు గ్రామాల మధ్య పల్లగుట్టను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల(ముస్తాబాద్): Pallagutta Protection | ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడూరు గ్రామాల మధ్య పల్లగుట్టను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) అన్నారు. బుధవారం పల్లగుట్టను ఆయన సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

Pallagutta Protection | ప్రకృతి సంపదను కొల్లగొడితే ఊరుకోం..

ప్రకృతి సంపదకు నిలయమైన పల్లగుట్టను ధ్వంసం చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని, గుట్ట పరిరక్షణ కోసం రెండు గ్రామాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని చాడ వెంకట్​రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి జరిగే పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సంపూర్ణ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొండలు, గుట్టలను ఇష్టారాజ్యంగా తవ్వి ధ్వంసం చేయడం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను కొల్లగొడితే భవిష్యత్ తరాలకు మిగిలేది పర్యావరణ సంక్షోభమేనని హెచ్చరించారు.

Pallagutta Protection | పర్యావరణానికి పెను ముప్పు

కొండలు, గుట్టలు కేవలం రాళ్ల కుప్పలు కావని, అవి పర్యావరణ వ్యవస్థలో కీలక భాగాలని పేర్కొన్నారు. గుట్టలను విచ్చలవిడిగా తవ్వడం వల్ల సహజ నీటి ప్రవాహాలకు ఆటంకం ఏర్పడటంతో పాటు భూగర్భజలాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునే సహజ నిర్మాణాలు దెబ్బతిని భూగర్భ జలాల పునరుద్ధరణకు విఘాతం కలుగుతుందని వివరించారు. గుట్టలపై ఉండే వృక్షసంపద, చిన్న చిన్న జీవుల ఆవాసాలు నాశనమవుతాయని, దుమ్ము, ధూళి కాలుష్యం పెరిగి సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో ఉష్ణోగ్రతలు పెరగడం, స్థానిక వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

Pallagutta Protection | అధికారులు తక్షణమే స్పందించాలి..

పల్లగుట్ట విధ్వంసంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, గుట్ట తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, నిబంధనలను పరిశీలించి అక్రమాలు ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని చాడ వెంకట్​రెడ్డి డిమాండ్ చేశారు. గుట్టను పరిరక్షించేందుకు సమగ్ర విచారణ చేపట్టి, విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి గూడూరు మాజీ సర్పంచ్ సాకలి రమేష్ అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, కడారి రాములు, గీస బిక్షపతి, చెరుకు ఎల్లం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: KTR Comments | భూములు అమ్మే బ్రోకర్​ రేవంత్​రెడ్డి.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *