అక్షరటుడే, వెబ్‌డెస్క్: SS Retail IPO | ఎస్ఎస్ రిటైల్ కంపెనీని 2016లో స్థాపించారు. ఇది మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల రిటైల్ చైన్ ను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తన ఉత్పత్తులను ‘ఎస్ఎస్ మొబైల్ ’, ‘మొబైల్ ఎక్స్ఛేంజ్ వాలా ’, ‘ది మొబైల్ స్పేస్ ’ అనే బ్రాండ్‌ల పేరుతో కంపెనీ యాజమాన్యంలోని మరియు ఫ్రాంచైజీలతో నిర్వహించే స్టోర్ ఫార్మాట్‌ల ద్వారా విక్రయిస్తుంటుంది.
SS Retail IPO | వివిధ రకాల ఉత్పత్తులు..
ఎస్ఎస్ రిటైల్ ఉత్పత్తి శ్రేణిలో మొబైల్ ఫోన్లు, ప్రీ ఓన్డ్ స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలు, టెలివిజన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్‌లతో పాటు, మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, ఈఎంఐ సౌకర్యాలు, యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్ మరియు మొబైల్ రీచార్జ్ వంటి అనుబంధ సేవలు కూడా అందిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్‌లలో 536 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఎసఎస్ రిటైల్ పశ్చిమ భారతదేశం మరియు మహారాష్ట్రలో అతిపెద్ద మొబైల్ ఫోన్ రిటైల్ చైన్‌గా, భారతదేశంలోని తన పోటీదారులలో మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది.
SS Retail IPO | ఆర్థిక పరిస్థితి..
2025లో రూ. 1,599.96 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2026లో రూ. 2,352.85 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 39.86 కోట్ల నుంచి రూ. 59.28 కోట్లకు చేరింది. ఆస్తులు రూ. 389.44 కోట్లనుంచి రూ. 575.42 కోట్లకు పెరిగాయి.
SS Retail IPO | ఇష్యూ సైజ్..
కంపెనీ ఐపీవో (IPO) ద్వారా రూ. 500.75 కోట్లు సమీకరించనుంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 360.75 కోట్లు సమీకరించనుండగా.. మిగిలినది ఓఎఫ్ఎస్. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి, అదనపు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు.
ధరల శ్రేణి : కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 403 నుంచి రూ. 424 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 35 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,840తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్లు వేయవచ్చు.
కోటా : క్యూఐబీలకు 50శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, హెచ్ఎన్ఐ 15శాతం కోటా కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఒక్కో షేరు రూ. 135 ప్రీమియంతో ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 31 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు : ఎస్ఎస్ రిటైల్ ఐపీవో సెప్టెంబర్ 16 న ఓపెన్ అవుతుంది. 18 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 21 న ఉంటుంది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 23న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ షురూ.. క్రోమాలో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్లు