Tirumala Venkata Ramana | వెంకట రమణ స్వదేశానికి రాక కోసం.. కేంద్ర మంత్రిని కలిసిన భాను ప్రకాష్ రెడ్డి

కువైట్‌లో కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న తిరుమల వెంకట రమణను తిరిగి రప్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tirumala Venkata Ramana | కువైట్‌లో కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న తిరుమల వెంకట రమణను తిరిగి రప్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఏళ్లుగా తండ్రి రాక కోసం ఎదురుచూస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెల కన్నీటి వేదనను మంత్రి కిషన్ రెడ్డికి  ( Kishan Reddy )భాను ప్రకాష్ రెడ్డి పూసగుచ్చినట్లు వివరించారు. కుటుంబంతో తిరిగి కలుసుకోవాలనే వెంకట రమణ ఆశను నెరవేర్చేందుకు తక్షణ సహాయం అందించాలని కోరారు.

Tirumala Venkata Ramana | కిషన్ రెడ్డి సానుకూల స్పందన..

తిరుమల వెంకట రమణ కుటుంబం పడుతున్న ఇబ్బందిని సానుకూలంగా పరిశీలించిన కిషన్ రెడ్డి .. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయనను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి తండ్రిని కుటుంబం చెంతకు చేర్చేందుకు భాను ప్రకాష్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి:  NTR Deepfake Video | ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. నిందితులకు గట్టి హెచ్చరిక

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *