Michael Biopic | అల్లు సినిమాస్‌లో ‘మైఖేల్’ స్పెషల్ షో.. అభిమాన స్టార్ బయోపిక్‌ను సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:  | ఐకాన్ స్టార్, “ఇండియన్ మైఖేల్ జాక్సన్”గా అభిమానులు పిలుచుకునే అల్లు అర్జున్ (Allu Arjun) తన అభిమాన పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ (Michael) చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించినట్లు తెలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించగా, హైదరాబాద్‌ (Hyderabad)లోని తన సొంత మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ (అల్లు సినిమాస్లో) ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు బన్నీ హాజరై సంద‌డి చేశారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసి సందడి చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Michael Biopic | సొంత థియేట‌ర్‌లో..

ఒక గొప్ప డాన్సర్‌గా తనపై మైఖేల్ జాక్సన్ చూపిన ప్రభావం గురించి పలుమార్లు చెప్పిన బన్నీ.. ఇప్పుడు ఆయన జీవితాన్ని తెలియ‌జేసే బయోపిక్‌ను ఇలా సెలబ్రేట్ చేయడం అభిమానులను  మరింత ఉత్సాహానికి గురిచేసింది. ఇక ఈ సినిమా కోసం అల్లు సినిమాస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రీమియర్ షోలకే టికెట్లు హౌస్‌ఫుల్ కావడం, ఫ్యాన్స్ భారీగా స్పందించడం విశేషం. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఆంటోని ఫుక్వా తెరకెక్కించారు. జాక్సన్ చిన్ననాటి నుంచి ప్రపంచ స్థాయి పాప్ ఐకాన్‌గా ఎదిగిన ప్రయాణాన్ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Michael Biopic | భారీ ఆసక్తి చూపుతున్నారు

సంగీతం, నృత్యం, భావోద్వేగాలతో నిండిన ఈ బయోపిక్ (Biopic) ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ తెచ్చుకుంటుండగా, మైఖేల్ జాక్సన్ (Michael Jackson) అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఈ సినిమాపై భారీ ఆసక్తి చూపుతున్నారు. అల్లు అర్జున్ హాజరు కావ‌డంతో ‘మైఖేల్’ సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక బ‌న్నీ ప్ర‌స్తుతం రాకా అనే చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది.

ఇది కూడా చదవండి..: Monalisa Case | విచారణకు రాలేనన్న మోనాలిసా.. కారణం ప్రెగ్నెన్సీయేనా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *