అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief Mahesh Goud | కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో ధనిక రాష్ట్రం అయిన తెలంగాణ అప్పులపాలైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడాన్ని నిరసిస్తూ.. ఆదివారం ఇందిరా పార్క్ (Indira Park) వద్ద పీసీసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సభకు ఎందుకు రావడం లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. ఆయన కొడుకు, అల్లుడు అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అల్లుడు, కొడుక్కి అవకాశం ఇస్తా అనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
PCC Chief Mahesh Goud | హామీలు అమలు చేస్తున్నాం
అధికారం ప్రజలు ఇచ్చే కానుక అని మహేశ్ గౌడ్ అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని ముఖం చాటేశారన్నారు. తాము మాత్రం ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
PCC Chief Mahesh Goud | 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం
రెండేళ్లలో రూ.లక్ష 78 వేల కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇప్పటికే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, రానున్న రెండేళ్లలో భారీగా నియామకాలు చేపడుతామన్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రతిపక్షాలు ఎత్తి చూపాలి కానీ, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.
ధర్నా స్థలికి చేరుకున్న…
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్• @Bmaheshgoud6666 https://t.co/JcEXKqh5Gv pic.twitter.com/6uWpzmbSKb
— Congress for Telangana (@Congress4TS) September 6, 2026
దీనిని కూడా చదవండి : Anak Krakatoa Eruption | ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 50 వేల అడుగుల ఎత్తులో బూడిద మేఘాలు