Illegal Mining | అక్రమ మైనింగ్​పై హైడ్రా ఉక్కుపాదం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Mining | హైదరాబాద్​ నగరంలో అక్రమ మైనింగ్​పై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రంగారెడ్డి జిల్లా (రంగారెడ్డి జిల్లా)లోని 6 ప్రాంతాల్లో హైడ్రా అధికారులు మంగళవారం దాడులు చేశారు.

అనుమతులు లేకుండా నడుస్తున్న 6 స్టోన్​ క్రషర్స్​ను అధికారులు తొలగించారు. వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కొత్వాల్​గూడ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పొల్యూషన్​ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖ​ల అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న యూనిట్లను ధ్వంసం చేశారు.

Illegal Mining | ప్రముఖ సంస్థలతో సంబంధం

నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఈ క్వారీలతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోంది. పేలుళ్లు, కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ సంస్థలతో సంబంధం ఉన్న ఈ యూనిట్లు, హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ కార్యకలాపాలు కొనసాగించాయి. దీంతో వీటిని శాశ్వతంగా తొలగించారు. ఇందులో మంత్రి పొంగులేటికి (Minister Ponguleti) చెందిన రాఘవ కన్​స్ట్రక్షన్ క్రషర్​ కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల దీనిపై బీఆర్​ఎస్​ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో దీని గురించి లేవనెత్తారు. తాజాగా ఆ క్రషర్​ను తొలగించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Nizampet Fire Accident | నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వరుసగా ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం, స్థానికుల్లో ఆందోళన!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *