HYDRAA | చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు హైడ్రా అడ్డుక‌ట్ట‌

హైదరాబాద్​ నగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు చేపడుతుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు చేపడుతుంది. ఇటీవల అక్రమ నీటి దందాపై కొరఢా ఝుళిపించిన హైడ్రా తాజాగా.. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది.

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లాలోని ఆర్‌.కె.పురం చెరువు (ముక్కిడికుంట‌) మినీ ట్యాంక్‌బండ్‌గా పేరుగాంచింది. అయితే కొందరు ఈ చెరువును కబ్జా చేసేందుకు యత్నించారు. ఈ మేరకు ఫిర్యాదులు అందడటంతో హైడ్రా రంగంలోకి దిగింది. గురువారం 12 ఎక‌రాల మేర ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి కంచె వేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే కొందరు ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించుకున్నారు. కంచెలు వేసుకుని త‌లా కొంత అని చెరువు స్థలాన్ని పంచుకున్నారు.

 HYDRAA | చెరువులోకి వ్యర్థాలు..

ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డిన వారు ఆ స్థలాన్ని క‌బేలాలుగా వినియోగించారు. ఆ వ్యర్థాలను చెరువులో పారబోస్తున్నారు. దీంతో హైడ్రా సిబ్బంది గురువారం ప్రికాస్ట్ వాల్స్‌తో వేసిన ప్ర‌హ‌రీల‌ను తొలగించారు. భవిష్యత్​లో మళ్లీ ఆక్రమణలు జరగకుండా.. ఎఫ్​టీఎల్ పరిధి చుట్టూ ఫెన్సింగ్​ వేశారు. కాగా ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 75 ఎకరాలు కాగా.. ఇప్పటికే 11 ఎక‌రాలు ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. మరో 12 ఎక‌రాలు ఆక్రమించే యత్నం చేయగా.. హైడ్రా అడ్డుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : GPO Bribery Case | రూ.22 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జీపీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *