అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Green Card Rules | తన దేశంలో తాత్కాలిక వీసాలపై (హెచ్-1బి, విద్యార్థి తదితర) ఉంటూ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీయులకు అమెరికా (America) షాక్ ఇచ్చింది. ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం అందరికీ కుదరదు. ఇందుకోసం ముందుగా స్వదేశానికి వెళ్లి, అక్కడి అమెరికన్ కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. ‘విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, టూరిస్టు వీసా మీద అమెరికాకు వచ్చినవారు తమ పని పూర్తికాగానే దేశాన్ని వీడి వెళ్లాలి. గ్రీన్‌కార్డు హోదా పొందడానికి వారి పర్యటన తొలి అడుగులా మారకూడదు. ఈ నూతన విధాన లక్ష్యం’ ఇదే’ అని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్ ) ప్రతినిధి కహ్లర్ వివరించారు.
US Green Card Rules | అసాధారణ పరిస్థితుల్లో అవకాశం..
గతంలో అమెరికాలో చట్టబద్ధమైన వీసాలపై ఉన్నవారు, దేశం విడిచి వెళ్లకుండానే ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ట్రంప్ (Trump) సర్కారు తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. కాగా ఈ విధానం కొనసాగనుంది. అయితే అత్యవసర లేదా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్‌సీఐఎస్ అనుమతించనుంది. కాగా హెచ్-1బి కార్మికులు, విదేశీ విద్యార్థులు అమెరికా వదిలి వెళ్లాల్సి రావడం వల్ల తీవ్రమైన అనిశ్చితి ఏర్పడింది. అయితే అత్యవసర ఇమ్మిగ్రెంట్ వీసా (Immigrant Visa) ప్రాసెసింగ్ నిలిపివేత జాబితాలో భారతదేశం లేకపోవడం భారతీయ దరఖాస్తుదారులకు స్వల్ప ఊరటనిచ్చే అంశం.
US Green Card Rules | దుర్వినియోగాన్ని తగ్గించాలనే..
తమదేశ వలస చట్టాల అసలు ఉద్దేశానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కహ్లర్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల చట్టంలోని లోపాలను ఉపయోగించుకుంటూ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గుతాయన్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైనా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారిని గుర్తించి, తొలగించే అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Cockroach Janata Party | సరిహద్దులు దాటి.. పాకిస్థాన్‌కూ పాకిన ‘బొద్దింక’ల ట్రెండ్


