అక్షరటుడే, ఆర్మూర్: Rakesh Reddy | ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు అంకాపూర్లోకి వచ్చే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Rakesh Reddy | పోలీసులను తప్పించుకొని..

ఈ క్రమంలో సోమవారం ఉదయం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్మూర్ (Armoor) ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసుల కళ్లు గప్పి వారు ఎమ్మెల్యే ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రాకేష్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరగగా.. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారికి అదుపులోకి తీసుకుని జీప్లలో ఎక్కించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Rakesh Reddy | పటిష్టమైన భద్రత..

కాంగ్రెస్, బీజేపీ సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో అంకాపూర్‌లో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పీఎస్, నందిపేట్, మోర్తాడ్, మాక్లూర్, ఆలూర్ మండలాల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ వైపుల నుంచి అంకాపూర్లోకి వచ్చీవెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తల యత్నం.. అంకాపూర్‌లో అరెస్ట్ చేసిన ఆర్మూర్ పోలీసులు#Armoor #Ankapur #MlaRakeshreddy #Congress #Telangana #BreakingNews pic.twitter.com/6RrEaEN4O6
— Akshara Today | Telugu News (@aksharatoday) July 20, 2026
ఇది కూడా చదవండి..: Armoor Political Tension | ఆర్మూర్‌లో హైటెన్షన్.. వినయ్ రెడ్డి హౌస్ అరెస్ట్