Shotball State Selection | గోల్డ్ షాట్​బాల్ పోటీలకు మోతే విద్యార్థుల ఎంపిక

Shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్(​వేల్పూర్): Shotball State Selection | మండలంలోని మోతే(Mothe) గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి గోల్డ్ షాట్​బాల్ (Gold Shotball) పోటీలకు ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూర్​లోని సెక్రెట్ హార్ట్ ఉన్నత పాఠశాల వేదికగా ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న మొదటి రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటున్నారు.

Shotball State Selection | క్రీడాకారులు వీరే..

పాఠశాలకు చెందిన ఎం రూప, ఏ కీర్తన, అలీన, రాజశ్రీ, విన్ను, వరుణ్ ఈ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) మంచిర్యాల సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్​ఎం వైద్య గణేష్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని క్రీడానైపుణ్యాన్ని గుర్తించి, వారిని రాష్ట్రస్థాయికి తీర్చిదిద్దిన పీడీ సురేష్ కుమార్‌ను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కొనియాడారు.

​Shotball State Selection | రాష్ట్రస్థాయిలో రాణించాలి

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను సర్పంచ్ డొల్ల రమేశ్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే క్రీడాభిమానులు డొల్ల రాజేశ్వర్ రెడ్డి, చేపూర్ మనోహర్ రెడ్డి, అల్లపుల్ల గంగారెడ్డి తదితరులు విద్యార్థులను అభినందించారు. జిల్లాకు(Nizamabad) రాష్ట్రస్థాయిలో పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్, మంచి గణేష్, రత్నం, శ్రావణి శ్రీ, నవనీత, కవిత, నరసింహారావు, వెంకట నర్సయ్య పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TRS party | ఈసీ రూల్స్‌కు కవిత ‘రివర్స్’ స్కెచ్.. ‘TRS’ బ్రాండ్ కోసం చివరన ఆ చిన్న అక్షరం!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *