అక్షరటుడే, వెబ్డెస్క్ : Illegal Buildings | అక్రమ కట్టడాలు, అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం 19 నిర్మాణాలను తొలగించారు.
గచ్చిబౌలి అంజయ్య నగర్ (Anjaiah Nagar)లో ఇటీవల ఓ ఎడంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అనుమతులు లేకుండా, తక్కువ స్థలంలో నాలాను ఆక్రమించి భవనం నిర్మించడంతో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి, కూల్చివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
Illegal Buildings | 26 భవనాల గుర్తింపు
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం 19 భవనాలను కూల్చివేశారు. మరో 26 అక్రమ కట్టడాలను గుర్తించారు. అందులో బాధ్యులైన వారికి 12 నోటీసులు జారీ చేశారు. కూల్చివేతలలో అత్యధికంగా శేరిలింగంపల్లి జోన్‌లో 9 కట్టడాలను, కుత్బుల్లాపూర్ జోన్‌లో 6, కూకట్‌పల్లి జోన్‌లో 4 కట్టడాలు ఉన్నాయి. భవిష్యత్తు చర్యల కోసం మరో ఏడు భవనాలను గుర్తించారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.
భవన నిర్మాణ నిబంధనలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవడానికి సీఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నాయి. గుర్తించిన అన్ని అనధికార నిర్మాణాలపై నిర్దేశించిన విధానం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం 22 అధికారులను గుర్తించిన అధికారులు 14 భవనాలను కూల్చివేశారు.
CMC Unauthorized Constructions Enforcement Drive | 29.08.2026
Continuing the field-level enforcement drive, CMC teams identified 26 unauthorized constructions across the Corporation today.
🏗️ 19 unauthorized constructions were demolished(today)
📄 12 notices were served
🔹 7… pic.twitter.com/Y2bakYylLo— Cyberabad Municipal Corporation (@CMC_Offcl) August 29, 2026
దీనిని కూడా చదవండి : Kapra Lake | కాప్రా చెరువులో గణేశ్ నిమజ్జనం చేయొద్దు : హైడ్రా