అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rythu Commission | రైతు కమిషన్ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు కమిషన్ బృందం సభ్యులు శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Rythu Commission | ఇరిగేషన్ నివేదిక సమర్పణ..
సీఎంను కలిసిన కమిషన్ సభ్యులు సుమారు రెండు గంటల సేపు సమావేశమయ్యారు. తాము రూపొందించిన ఇరిగేషన్ నివేదికను (irrigation report) రేవంత్‌రెడ్డికి అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. రెండేళ్ల కాలంలో రైతు కమిషన్ చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు, సూచనలను సీఎంకు వివరించారు. కమిషన్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ వారి పనితీరుకు కితాబునిచ్చారు. రైతాంగం కోసం ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతులకు చేరేలా చూడాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాములు నాయక్, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి ఉన్నారు.
ఇది కూడా చదవండి: విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్..