అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kapra Lake | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సైనిక్‌పురిలో గల కాప్రా చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ కోరారు. ఈ చెరువు సాధారణ నీటి వనరు మాత్రమే కాదు.. నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందన్నారు.
కాప్రా చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఆ పనులను శనివారం కమిషనర్ రంగనాథ్ (Ranganath) పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువులో గణేశ్ నిమజ్జనం చేయొద్దని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్థానిక ప్రతినిధులకు వివరించారు. చిన్న విగ్రహాలు నిమజ్జనానికి (Ganesh Immersion) చెరువు చెంత ఉన్న బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అర్బన్ వెట్ల్యాండ్స్లో భాగంగా ఉన్న ఈ చెరువు లక్ష్యాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
Kapra Lake | చెరువు అభివృద్ధికి..
కాప్రా చెరువులో 70 శాతం వరకూ ప్రైవేట్ పట్టా భూములు ఉన్నాయని రంగనాథ్ అన్నారు. వారు ముందుకు వచ్చి చెరువు అభివృద్ధికి సహకరించారన్నారు. కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను కలిసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ చెరువుకు ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 470కు పైగా వలస పక్షులు ఇక్కడకు వస్తాయన్నారు. 113 ఎకరాల కాప్రా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోందని కమిషనర్ పేర్కొన్నారు.
వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జీవవైవిధ్యం, పక్షుల ఆవాసం వంటి పర్యావరణ హితమైన అంశాల ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ సమయంలో చెరువులో నిమజ్జనం సరికాదని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు.
దీనిని కూడా చదవండి: Kyiv Drone Attack | ఉక్రెయిన్‌పై రష్యా భీకర డ్రోన్ దాడి.. 27 మంది మృతి