అక్షరటుడే, వెబ్డెస్క్: SBI Bank Strike | తమ డిమాండ్లు నెరవేర్చాలని బ్యాంకర్లు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఒక రోజు బంద్ పాటించిన వారు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.
జరగనున్న మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు ముందు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) వినియోగదారులకు ఒక సలహా జారీ చేసింది. సమ్మె కాలంలో ఎదురయ్యే అంతరాయాలను నివారించడానికి, ముఖ్యమైన బ్రాంచ్ సంబంధిత పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు వినియోగదారులను కోరింది.
SBI Bank Strike | ఐదు రోజుల పాటు బంద్
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులు సమ్మె చేపట్టనున్నారు. దీంతో ఆ రోజుల్లో బ్యాంకులు పని చేయవు. 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో సెలవు ఉంటుంది. దీంతో 5 రోజుల పాటు బ్యాంకులు ఓపెన్ కావు. ఈ క్రమంలో సమ్మెకు ముందు అవసరమైన బ్రాంచ్ సంబంధిత లావాదేవీలను పూర్తి చేసుకోవాలని, సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం డిజిటల్ మరియు ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించుకోవాలని వినియోగదారులకు సూచించింది.
SBI Bank Strike | అత్యవసర సేవలు
సమ్మె సమయంలో అత్యవసర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఉద్యోగుల భాగస్వామ్యాన్ని బట్టి బ్రాంచ్ కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. నగదు ఉపసంహరణలు, ఇతర అర్హత గల సేవల కోసం ఏటీఎంలు, డిపాజిట్ మెషీన్లను (ADWM) ఉపయోగించుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ పాయింట్లు (CSPs) కూడా అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా చదవండి..: Asian Games Shooting | ఆసియా గేమ్స్.. షూటింగ్లో భారత్కు మరో రెండు పతకాలు