Darpalli Suicide Case | అమ్మాయి మోసం చేసిందని.. యువకుడి ఆత్మహత్య

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Darpalli Suicide Case | ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ధర్పల్లి మండలం మరియా తండాలో చోటు చేసుకుంది.

Darpalli Suicide Case | మరొకరితో పెళ్లికి సిద్ధం కావడంతో..

మరియ తండాకు చెందిన బానోత్​ విజయ్​(22) స్థానికంగా ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. అయితే ఆ యువతి విజయ్​తో కాకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమైందని అని వీడియోలో తెలిపాడు. అమ్మా,నాన్నలు బాగుండాలని తన వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. అతడి వద్ద ఉన్న మొబైల్‌లోని వీడియో ఆధారంగా ప్రేమించిన యువతి వదిలేసిందనే కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..: BRS Public Apology | స్పీకర్​కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *