Nizamabad Police Arrests | పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్టు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Police Arrests | విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ Police సిబ్బందికి ఆటంకం కలిగించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఐదో ఠాణా ఎస్‌ఐ సునీల్​ తెలిపారు.

Nizamabad Police Arrests | రిమాండ్​కు తరలింపు..

నిజామాబాద్‌లో అక్టోబర్‌ 27, 2026న విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందికి సాయినగర్‌-3కు చెందిన శ్రవణ్‌, రాకేష్‌, రఘురామ్‌ ఆటంకం కలిగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

అనంతరం శ్రవణ్‌, రాకేష్‌, రఘురామ్‌లను అరెస్టు చేసి, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *