Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum Pension Hike | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ వో (EPFO) పరిధిలోని పెన్షనర్లు చాలా ఏళ్లుగా కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. వెయ్యి గా ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చితే ఈ మొత్తం ఏ మూలకూ సరిపోదు. పెరుగుతున్న ఖర్చులకు వచ్చే పెన్షన్ మొత్తానికి సంబంధం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) పెన్షనర్లకు కాస్త ఉపశమనం కలిగించే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతమేర పెంచుతారు అన్న దానిపై స్పష్టత లేదు.

Minimum Pension Hike | ఎంత పెరగొచ్చంటే?

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగుల కనీస పెన్షన్‌ను రూ. 7,500 లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. 2014 నుంచి నెలకు వెయ్యి రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500 లకు పెంచాలని ఈపీఎస్ -95 సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు గతంలో ఒక పార్లమెంటరీ కమిటీ కూడా మద్దతు ఇచ్చింది. పెన్షన్ పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Minimum Pension Hike | పెన్షన్ పొందడానికి అర్హతలు..

ఈపీఎఫ్‌వో సభ్యుడై ఉండాలి. కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులు. వారికి 58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. అయితే 50 ఏళ్లకే ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. కానీ పెన్షన్ మొత్తం కొంత తగ్గుతుంది.

Minimum Pension Hike | ఈపీఎఫ్‌వో నుంచి డబ్బు విత్‌డ్రా సులభతరం

పెన్షన్ పెంచడంతో పాటు ఈపీఎఫ్‌వో నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను కూడా సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే ఏటీఎంల ద్వారా ఖాతాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం ప్రారంభం కానుంది. దీనివల్ల ప్రజలకు ఈపీఎఫ్ డబ్బు త్వరగా, సకాలంలో, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుతుందని భావిస్తున్నారు. అలాగే పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని ఇచ్చే ప్రతిపాదనను కార్మిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Vijay Oath Taking | రేపే విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం.. మెజారిటీ కోసం క‌స‌ర‌త్తు, మ‌ద్ధ‌తుపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *