Vijay Trisha | టీవీకే చీఫ్​ విజయ్ ఇంటికి త్రిష..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Trisha | తమిళనాడు (Tamil Nadu)లో టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 108 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీవీకే అధినేత కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Vijay Trisha | తిరుమల నుంచి…

నటి త్రిష విజయ్​ (Trisha Vijay) ఇంటికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి నేరుగా విజయ్​ ఇంటికి వచ్చారు. అధికార పీఠం దిశగా అడుగులు వేస్తున్న విజయ్​కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా విజయ్​ తన భార్య సంగీతతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. విజయ్​ త్రిషతో రిలేషన్​షిప్​ కొనసాగిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో విజయ్​ ఇంటికి త్రిష వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

ఇది కూడా చదవండి..:  Bengal BJP Rise | బెంగాల్​లో కమల వికాసం.. బీజేపీ విజయానికి కారణాలివే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *