అక్షరటుడే, వెబ్డెస్క్: Caliber Mining IPO | క్యాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ 2014 లో ఏర్పాటయ్యింది. ఇది కోల్ ఎక్స్ట్రాక్షన్స్, ఓవర్ బర్డెన్ రిమూవల్, కోల్ లోడింగ్, అన్ లోడింగ్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ కోఆర్డినేషన్ వంటి పూర్తి స్థాయి కోల్ మైనింగ్, లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అందిస్తుంది.
Caliber Mining IPO | రూ. 450 కోట్లు సమీకరించిన కంపెనీ..
ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 450 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 94,33,962 షేర్లను విక్రయించి రూ. 400 కోట్లు, అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 11,79,245 షేర్లను అమ్మడం ద్వారా రూ. 50 కోట్లు సమీకరించారు. ఈ ఐపీవో (IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగాకానీ, పాక్షికంగా కానీ చెల్లించడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది.
Caliber Mining IPO | నెగెటివ్ మార్కెట్లోనూ స్ట్రాంగ్ లిస్టింగ్
క్యాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ ఐపీవో జూలై 17న ప్రారంభమైంది 21 వరకు బిడ్లు స్వీకరించారు. కంపెనీ షేర్లు శుక్రవారం ఎన్ ఎస్ ఈ, బీఎస్ ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 424 కు ఆఫర్ చేయగా.. రూ. 500 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో సుమారు 18 శాతం లాభాలను అందించిందన్న మాట. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో రూ. 483 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 శాతం ప్రీమియమే లభించినా.. నెగెటివ్ మార్కెట్లో ఇది స్ట్రాంగ్ లిస్టింగే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి..: 2026 ‘టీమ్ ఇండియా’ భాగస్వామిగా ఐఓఏతో యస్ బ్యాంక్ భాగస్వామ్యం!