Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

Naresh Chandan
Harish Rao TRS row

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. T. Harish Rao కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం వేడెక్కింది. దీనికితోడు TRS పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

WhatsApp Image 2026 04 29 at 10.13.54 PM

Harish Rao TRS row : తుపాకుల బాలరంగం పేరిట

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక లేఖ ఈ చర్చలకు కారణం అవుతోంది. తుపాకుల బాలరంగం పేరిట Telangana Rajya Samithi (TRS) పేరుతో ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ జరిగిందని, అదే పేరుతో మరో పార్టీని నమోదు చేయవద్దని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు రాసిన ఓ లేఖ వెలుగు చూసింది. ఈ లేఖలో TRS అనే సంక్షిప్త పేరుపై తమకే హక్కులు ఉన్నాయని స్పష్టం చేయడం గమనార్హం.

కాగా, K. Kavitha కూడా TRS పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పరిణామాలు రాజకీయ వర్గాల్లో గందరగోళానికి కారణం అవుతోంది. ప్రత్యేకంగా, ఈ లేఖ వెనుక T. Harish Rao వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ జోరందుకుంది. ఆయన అనుచరుడిగా భావిస్తున్న తుపాకుల బాలరంగం ద్వారా ఈ అభ్యంతర లేఖ పంపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో Bharat Rashtra Samithi (BRS) శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Harish Rao TRS row : నిరాశలో T. Harish Rao!

ఇప్పటికే పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదనే నిరాశలో T. Harish Rao ఉన్నట్లు ప్రచారంలో ఉంది. చాలా కాలంగా ఆయన తన సమయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే TRS పేరుతో కొత్త రాజకీయ వేదికను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా చూస్తే, ఒకే పేరుపై రెండు వర్గాల కదలికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *