Labor Codes | లేబర్​ కోడ్​ల​ అమలును తక్షణమే నిలిపేయాలి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Labor Codes | కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల లేబర్​ కోడ్​లను అమలు పర్చేందుకు గెజిట్​ తీసుకొచ్చిందని.. దానిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్​ ​బాబు డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని లేబర్​ కార్యాలయంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కార్మికులతో కలిసి గెజిట్​ పత్రాలను దహనం చేశారు.

Labor Codes | వెనక్కి తగ్గని పీఎం మోదీ..

ఈ సందర్భంగా రమేశ్​​ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యజమానులకు మరింత లాభాలను పెంచడానికి కార్మిక హక్కులను పణంగా పెడుతోందన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్​లను తీసుకొచ్చారని.. వీటిపై దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించినప్పటికీ పీఎం మోదీ వెనక్కి తగ్గట్లేదన్నారు. మోదీ ప్రభుత్వం (Modi Government) నిరసనలను లెక్కచేయకుండా గెజిట్​ను విడుదల చేసిందన్నారు. ఫలితంగా ప్రైవేట్​ కంపెనీల యాజమాన్యాలు లేబర్ కోడ్​లను అమలు చేసేందుకు పని గంటలు పెంచటానికి వేతనాల్లో కోతలు విధించడానికి సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు.

Labor Codes | కార్మికులకు భద్రత కరువు..

కోడ్​ల కారణంగా కార్మికులకు భద్రత లేకుండా పోయిందని రమేశ్ బాబు వివరించారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నట్లేనన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్​ (Labour Code)లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్​ చేస్తోందన్నారు. లేకపోతే రాబోయే కాలంలో అన్ని రంగాల కార్మికులతో ఐక్య పోరాటాలకు సిద్దపడాల్సి వస్తుందని దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ రిప్రెజెంటేటివ్స్​ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గంగామోహన్, నాయకులు సంపత్, శేషు, లక్ష్మీకాంత్, కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం.. బీజేపీకి సంబంధం లేదు: ఎమ్మెల్యే పైడి రాకేష్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *