Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Ujjivan WhatsApp Banking | ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంచలనం.. వాట్సాప్‌లోనే సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్!

భారతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ 'ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్' (Ujjivan SFB) ఒక విప్లవాత్మక డిజిటల్ సేవకు శ్రీకారం చుట్టింది.

Shivam nagarani
Last updated: November 9, 2026, 7:36 pm 7:36 pm
Shivam nagarani
Share
Ujjivan WhatsApp Banking

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ujjivan WhatsApp Banking | భారతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Ujjivan SFB) ఒక విప్లవాత్మక డిజిటల్ సేవకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా కస్టమర్లు ఎలాంటి ప్రత్యేక బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారా సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు తమ రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించే వాట్సాప్ వేదికగానే ఈ సులభమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తోంది.

Ujjivan WhatsApp Banking | సులభమైన విధానం..

క్రొత్త కస్టమర్లు చాలా వేగంగా, కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ క్రింది విధంగా తమ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు.

మెసేజ్ పంపడం: కస్టమర్లు తమ మొబైల్‌లో 900 208 2121 నంబర్‌ను సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపాలి.

ఆప్షన్ ఎంపిక: ఆ తర్వాత అందులో వచ్చే ఆప్షన్లలో ‘Open Savings Account’ను ఎంచుకోవాలి.

వివరాల ధృవీకరణ: మొబైల్ నంబర్ , పాన్ (PAN) కార్డ్ వివరాల వెరిఫికేషన్ పూర్తయ్యాక.. CKYC లేదా ఆధార్ ద్వారా వ్యక్తిగత వివరాలు ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి.

డిపాజిట్ & వీడియో కేవైసీ: కస్టమర్ తనకు నచ్చిన సేవింగ్స్ అకౌంట్ రకాన్ని ఎంచుకుని, ప్రారంభ డిపాజిట్ సొమ్మును చెల్లించి, వీడియో కేవైసీ (Video KYC) పూర్తి చేయాలి.

వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అకౌంట్‌ను నేరుగా వాడుకోవడం ప్రారంభించవచ్చు.

Ujjivan WhatsApp Banking | వాట్సాప్‌లోనే 50కి పైగా బ్యాంకింగ్ సేవలు..

ప్రస్తుతం ఉజ్జీవన్ బ్యాంక్‌కు సంబంధించిన 15 లక్షలకు పైగా వినియోగదారులు ఇప్పటికే వాట్సాప్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. బ్యాంక్ వచ్చే మొత్తం సర్వీస్ రిక్వెస్ట్‌లలో 22 శాతం కేవలం వాట్సాప్ ద్వారానే పరిష్కారమవుతున్నాయి. అకౌంట్ ఓపెనింగ్‌తో పాటు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా ఖాతా నిల్వ తనిఖీ (Balance Enquiry), అకౌంట్ స్టేట్‌మెంట్, డిపాజిట్ సేవలు, లోన్ వివరాలు, బ్యాంక్ బ్రాంచ్ & ఎటీఎం లొకేషన్లతో సహా 50కి పైగా రకాల సేవలను పొందే అవకాశం ఉంది.

Ujjivan WhatsApp Banking | సౌలభ్యమే మా ముఖ్య ఉద్దేశం..

“బ్యాంకింగ్‌ను వినియోగదారులకు మరింత సరళంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన అర్థం ఉంటుంది. ప్రజలు ప్రతిరోజూ వాడే వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌పైనే పూర్తి బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా అందించడమే మా ముఖ్య ఉద్దేశం” అని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇంటెరిమ్ సీఈఓ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కారొల్ ఫుర్టాడో వెల్లడించారు.

భిన్న భాషల్లో సేవలు..
కస్టమర్లకు డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Gen-AI), వాయిస్ అసిస్టెన్స్ (మాటల ద్వారా సహాయం), ప్రాంతీయ భాషల్లో సేవలను కూడా వాట్సాప్ బ్యాంకింగ్‌లో అనుసంధానించనున్నట్లు బ్యాంక్ యాజమాన్యం వెలడించింది.

ఇది కూడా చదవండి: Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

TAGGED:Banking NewsDigital Bankinglatest newsOnline Account OpeningSavings Accounttelugu newsUjjivan Small Finance BankUjjivan WhatsApp BankingVideo KYCWhatsApp Banking
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article ICICI Prudential ULIP Fund ICICI Prudential ULIP Fund | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నుంచి కొత్త యులిప్ ఫండ్.. ‘బీఎస్ఈ 500 మొమెంటం క్వాలిటీ 50’ ప్రారంభం
Next Article Nizamabad Poker Raids | Nizamabad Poker Raids | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Smit Machchhar Flydubai
జాతీయం

Smit Machchhar Flydubai | నువ్వు నిజమైన హీరో.. మచ్చార్ సాహసంపై ప్రధాని మోదీ ప్రశంసలు

By Shivam nagarani
Rahul Gandhi Demands
జాతీయం

Rahul Gandhi Demands | యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే.. మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

By Shivam nagarani
Telangana IAS Officers
తెలంగాణ

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

By Shivam nagarani
Ganja Smuggling
ఖమ్మం

Ganja Smuggling | ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.